Monday, October 1, 2012

ఎక్కడికో తెలీదు / Ekkadiko teleedu!


ఎక్కడికో తెలీదు
ప్రణీత పరగతాలు

'కాద'న్నది కాదనుకొని అనంతాలు యిమ్మన్నా,
'అవును కాదు'ల మధ్యన నిజం 'కాద'నే నమ్మా!
యెక్కడికో తెలీదు నేనాగకుండా వెళుతున్నా,
యెందుకలా చేయాలో యెవర్నడిగీ తెలీకున్నా!

సడిలేనిది చావయితే సమీప బంధువే చలి
తడిలేనిది జీవయితే తగులడేది యేముంది?
చురుకులోని చురకలనే చుక్కలే, నీలాకాశం!
ఉలుకులేని వూహలకు చిక్కనిదే అవకాశం!

ప్రణీత పరగతాల వెనుక దాగలేదు పరిహాసం
నాచు మొక్క నాగరికత నీటి చుక్కకే తెలుసు
భ్రమిత భ్రమరాలకందే మకరందం మందు కాదు
తుది మెలుకువ తెలిసికోను తల గల్గిన బొందిలేదు