భయం కడుపు నుండి భగవంతుడొచ్చాడు
బాదితుల భ్రమలతో బలవంతుడయ్యాడు
మహిమలన్నీ మనసు నమ్మని నిజాలు
మనసు అవధుల్లోనే ప్రమాద ముంటుంది!
కాని తత్త్వాలెన్నోకాలమే చూసింది
కవిత కందని కరుణ పుడమికే చెల్లింది
మనసు తెలియాలంటె కోతులను వెదకాలి
మనిషి తెలియాలంటె మమతతో నింపాలి!
అక్కనాలిని చేసి ఆడించు రాబందు,
నీ నుండి విడగొట్టు విడ్డూరపు మందు,
పగటి వెన్నెల వెనుక నీడలా కనువిందు,
పరువమన్నది; అదో పాచిపోయే పసందు!
నాకు కావాలది, నాకు కావాలిది
నాకు కావలసిన దాని, నిజమైన అవధేది?
నే పెంచినదే తనువు, నాకే కాదిది అనువు?
ఎందుకిక యీ చనువు, నిలవనిదే యీ మనువు!
జన్మనెత్తానంటు, జగతి నడవాలంటు,
జతకోసమై వెదికి, జవ సత్త్వాలు వుడిగి,
జప తపాలు చేసి, జీవ తత్త్వము తెలిసి,
నిజ గజాల పొత్తు, ఋజువు లేదని వెఱసె!
- On 4-Oct-2011 in memory of 4-Oct-1990