Friday, October 14, 2011

అసత్యం పక్కన


అసత్యం పక్కన

అసహనపు చీకట్లో
ఆరాధన పని లేదు
ఆకాశపు టంచుల
కొక ఆనవాలు వుండబోదు
సూది మొనకు ముక్కులెందుకు,
సున్నాలకు లెఖ్కలెందుకు?
అన్నీ తెలుసనే నీకు
అసత్యం పక్కనెందుకు?

కాదను కొన్నవన్నీ
కానివి కాలేదు గతంలో!
వాదానికి వేదాలే,
భేదాలు నీ స్వగతంలో!
గుండెల తిరిగిన సుడులు,
చూపలేదు యే గుడులూ!
సోపాన పట జడిలో,
విశదం కాలేదా గడులు!

తరం మారి తరగలేదు,
తెలియని తన మేనాడూ!
అలుపు నెరిగి మరువలేదు,
తొలి సవాళ్ళ నీనాడు!
క్షర క్షర దీపాలకు,
కక్ష్య లెందు కంటాను?
తప్పని తప్పుకు చెప్పిన,
తిప్పలేమిటంటాను?

బాటసారి, వేటగాడు,
కలసి చూసిన సిత్రం-
కాషాయపు వేషగాని,
కను కొలకుల రక్తం!
ఆత్మ శోధన కొఱకు,
రాత్రయినా తప్పులేదు!
అందని సారాంశా న్నందల
మెక్కించుట వొప్పుగాదు!

No comments:

Post a Comment