అమ్మన్నది ఆడదే! |
అమ్మన్నది ఆడదే!
పుట్టినాడు గిట్టనోడు కాకుండా వుండిపోడు
పురిటి నొప్పులుండబోని మరోజన్మ వుటుందా?
జన్మంటే పాపమని, జన్మంటే మోహమని
జననమె ఒక నేరమని జనాల కెందుకొచ్చింది!
పునీతుడు కావాలంటే పున్నమితో పుట్టాలని,
పుణ్యం చెయ్యాలంటే పూర్వజన్మ వుండాలని,
నీలో లేనిది నీకేదో తక్కువనే నిశా
రధుల నిర్వాకం నిజమనుకొంటున్నావా?
జంధ్యాన్నొక లుంగ చుట్టి జలుబు తీర్చుకోవచ్చు
సందెకాడ గంధమద్ది సందు చూసుకోవచ్చ
ఆడది 'పాతకి' అంటూ, పాతరేసి పెట్టొచ్చు
అమ్మన్నది ఆడదనే బుధ్ధి, లేక చెప్పొచ్చు!
మనుచరిత్ర మనుమరాళ్ళ ముచ్చట్లను తీర్చలేదు
మలి సందెకు ముందొచ్చిన మచ్చలనది మార్చలేదు
కురూపమే కావ్యరూప మయితే మరి కవు లెందుకు?
అమానుషపు అగచాట్లను జీవించను 'కౌలెం'దుకు?
No comments:
Post a Comment